బర్త్‌డే: సైడ్‌ ఆర్టిస్ట్‌గా త్రిష తొలి సంపాదన ఎంతో తెలుసా!

4 May, 2021 19:06 IST|Sakshi

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ త్రిష నేటితో 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. మంగళవారం(మే 4) త్రిష బర్త్‌డే సందర్భంగా నటీనటులు, సినీ ప్రముఖులు ఆమెకు విషెస్‌ తెలుపుతున్నారు. అయితే ఒక్కప్పుడు టాలీవుడ్‌లో అగ్రనటిగా రాణించిన త్రిష ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలు తగ్గించింది. ఈ మధ్యలో ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం చేసుకుని రద్దు చేసుకున్న ఆమె ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తమిళంలోనే వరుసగా సినిమాలు చేస్తూ దక్షిణాన సెటిలైయిపోయింది.

అయితే మూడు పదుల వయసులో కూడా నేటి తరం హీరోయిన్లకు పోటీ ఇస్తూ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న త్రిష కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్లకు స్నేహితురాలి పాత్రలు చేస్తూ సైడు క్యారెక్టర్లలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో త్రిష ఒక్క సినిమాకు 500 వందల రూపాయలు తీసుకునేదట. ఇప్పటి రోజుల్లో ఆ డబ్బు అసలు లెక్కలోకే రాదు.. కానీ అప్పట్లో 500 వందలు అంటే మాములు విషయం కాదు. చెప్పాలంటే మెగాస్టార్‌ చిరంజీవి తన తొలి రెండు చిత్రాలు ఎలాంటి డబ్బు తీసుకొకుండానే చేశారట. మూడవ చిత్రం నుంచే ఆయన డబ్బు తీసుకుంటున్నారట. అప్పుడు ఆయన తొలి సంపాదన రూ. 1118 అట. ఈ లెక్కన చూస్తే మెగాస్టార్‌ కంటే త్రిష తొలి చిత్రం రెమ్యూనరేషన్‌  ఎక్కువని చెప్పుకొవచ్చు. 

చదవండి: 
ఆ డైరెక్టర్‌ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత
త్వరలోనే త్రిష పెళ్లి.. వరుడు ఎవరంటే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు