Upasana: ‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌.. ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాను’

12 Nov, 2021 15:07 IST|Sakshi

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్యగా, అపోలో అధినతే మనవరాలిగా కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూ ఉపాసన కామినేనిగా ఆమె తనకంటూ ఓ బ్రాండ్‌ నేమ్‌ను సంపాదించుకున్నారు. అంతేగాక ఫిట్‌నెస్‌తో పాటు తన వ్యక్తిగత విషయాలు, భర్త  రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. గ్లామర్‌ ఫీల్డ్‌లో లేనప్పటికీ ఆమె ఓ సెలబ్రెటీ అయ్యారు. దీంతో ఆమెను చూసినవారంత ఉపాసన గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టింది, తనకేంటీ అనకుండ ఉండలేరు. అలా అనుకనే వారికి ఉపాసన ఇలా సమాధానం ఇచ్చారు.

చదవండి: ‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ

‘గోల్డెన్‌, సిల్వర్‌, ప్లాటినం స్పూన్‌తో పుట్టినంత మాత్రనా వారి లైఫ్‌ అంత ఈజీగా ఉంటుందా? ఉండదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యలు ఉంటాయి. అందరు అనుకుంటున్నట్టుగా లైఫ్‌ అంతా ఈజీగా ఉండదు. చెప్పాలంటే ఇది ఒక టఫ్‌ జర్నీ. ఎవరి ప్రాబ్లమ్స్‌ ఏంటనేది ఎవరికి తెలియదు. కానీ ఒకరి బాధను ఒకరూ రెస్పాక్ట్‌ చేయాలి. ఓ అమ్మాయి ఫ్యాన్సీ కారులో తిరుగుతూ, తన ఇష్టంగా తన జీవితం జీవిస్తుంటే ఆమెను చూడు ఎంత ఎంజాయ్‌ చేస్తుందో అంటూ అసూయ పడతారు. అలా అయితే నేను కూడా ఎలాంటి సమస్యలు, ఒత్తిడి లేకుండా హ్యాపీ జీవించేవారిని చూసి అసూయ పడతాను’ అంటూ చెప్పుకొచ్చారు.

చదవండి: పెళ్లి ఎప్పుడో చెప్పిన విష్ణు ప్రియ, ఆలోపే మింగిల్‌ అవుతానన్నా యాంకర్‌\

అలాగే తాను ఒకానోక సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశానని, లడ్డు అంటూ తన బాడీ షేమింగ్‌పై వచ్చిన కామెంట్స్‌ తీవ్రంగా బాధించాయన్నారు. ‘ఇప్పుడు నన్ను చూసి చాలా మంది బాగున్నావ్‌ అంటున్నారు. కానీ అది పెద్ద కాంప్లీమెంట్‌గా తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఇలా అవ్వడానికి దానిపై శ్రద్ధ పెట్టాను, గంటలు గంటలు దాని మీదే వర్క్‌ చేస్తున్నాను కాబట్టి సన్నగా తయారయ్యాను’ అని తెలిపారు. ఇక మహిళలు, పురుషులకు మధ్య వ్యత్యాసంపై ఆమె మాట్లాడుతూ.. ఇలాంటివి తాను నమ్మనని, ఎవరి బలం వారికి ఉంటుందన్నారు. అలాగే మహిళల, పురుషుల మధ్య బేధం చూడటం కూడా అనవసరమని అన్నారు. చెప్పాలంటే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌ అని తను అన్ని విషయాల్లో చురుగ్గా, ప్రతిభ కలిగి ఉంటారని ఉపాసన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు