ఎల్లప్పుడు మా కోసం ఉన్నందుకు ధన్యవాదాలు: ఉపాసన

11 Mar, 2023 21:55 IST|Sakshi

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఎంజిల్స్‌లో ఫుల్ బిజీ ఉన్నారు. తన భార్య ఉపాసనతో కలిసి ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంకతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  అమెరికాలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో పలువురు తారలు మెరిశారు.  సౌత్‌ ఏషియన్‌ ఎక్స్‌లెన్స్‌ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో మెగా కోడలు  ఉపాసన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంకతో దిగిన ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 

ఉపాసన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘లాస్‌ ఏంజెల్స్‌ ఫ్యామిలీ.. ఎల్లప్పుడూ మాకోసం ఉన్నందుకు థ్యాంక్యూ ప్రియాంక'  అని పోస్ట్ చేశారు.  తాజాగా ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. 

కాగా.. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  మన దేశం తరఫున ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ సందడి చేయనుంది. ప్రియాంక ఇచ్చిన పార్టీలో ఎన్టీఆర్ స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు.

ఆయనతో ఫొటోలు దిగేందుకు ప్రీతిజింటా, జాక్వెలిన్‌ తదితరులు ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం ఆ వేడుక ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, ‘నాటు నాటు’ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సైతం  ప్రియాంకతో ఫొటోలు దిగారు. ‘మగధీర’ తర్వాత రామ్‌చరణ్‌ - ప్రియాంక చోప్రా కలిసి ‘తుపాన్’ అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. అప్పటి నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు