బుల్లితెర‌పై ‘ఉప్పెన’ రికార్డ్‌.. స్టార్‌ హీరోలతో సమానంగా!

29 Apr, 2021 17:47 IST|Sakshi

ఉప్పెన.. ఇటీవల కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌​ బస్టర్‌ హిట్‌గా నిలిచిన మూవీ. రికార్డుల మీద రికార్డులను తన పేరు మీద లిఖించుకుంటోంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం, విలన్‌గా విజయ్‌ సేతుపతి నటన సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచాయి.

వెండితెరపై ఓ ఊపు ఊపిన ఉప్పెన.. ఇటు బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగించింది. థియేటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ చిత్రం ఈ మద్యే నెట్ ఫ్లిక్స్ లోనూ విడుదలైంది. అక్కడా మంచి వ్యూస్ సాధిస్తుంది.  తాజాగా  ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యింది.  తొలిసారి ప్రసారమైన ఉప్పెనకు ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్‌ దక్కింది. డెబ్యూ హీరోల సినిమాలకు ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల తర్వాత ఎక్కువ రేటింగ్ పొందిన చిత్రం ఇదే . ఇక అదే రోజున ప్రసారం అయిన విజయ్ మాస్టర్ సినిమాకు 4.86 రేటింగ్ వచ్చింది.

చదవండి: 
మరోసారి ‘బేబమ్మ’తో వైష్ణవ్‌ తేజ్‌ రొమాన్స్‌!
లాక్‌డౌన్‌పై డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు