నలుగురు పిల్లలున్న ఆ సింగర్‌ పెళ్లికి ప్రపోజ్‌ చేశాడు: హీరోయిన్‌

10 Aug, 2022 13:49 IST|Sakshi

Urvashi Rautela Says Egyptian Singer With 2 Wives Proposed Her: బాలీవుడ్ గ్లామర్ క్వీన్‌ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ 2015 మిస్‌ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది.  ఇటీవల 'ది లెజెండ్‌' సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు ఊర్వశీ ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో 'బ్లాక్‌ రోజ్‌' సినిమాలో నటించిన ఈ గ్లామర్‌ క్వీన్‌ తాజాగా తనకు వచ్చిన పెళ్లి ప్రతిపాదనల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. 

ఇంటర్వ్యూలో భాగంగా 'మీకు ఎప్పుడైన ఇబ్బందికర మ్యారేజ్ ప్రపోజల్‌ వచ్చిందా?' అని అడిగిన ప్రశ్నకు షాక్‌ అయ్యే సమాధానం ఇచ్చింది ఊర్వశీ.  'నాకు చాలా మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వచ్చాయి. అందులో మీరు చెప్పినటువంటి ప్రతిపాదన ఒకటి ఉంది. దుబాయ్‌లో ఈజిప్ట్‌కు చెందిన స్టార్‌ సింగర్‌ ఒకరిని కలిశాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అయితే అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది మన సాంస్కృతికి, సాంప్రదాయానికి విరుద్ధం. మనం మన కుటుంబం గురించి ఆలోచించగలగాలి. అలాగే ఒక మహిళ తన జీవితం గురించిన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు' అని తెలిపింది. 

చదవండి: ఆ హీరోయిన్‌కు రూ. 20 కోట్ల పారితోషికం !..
నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు.. మీడియాతో తాప్సీ వాగ్వాదం

అయితే ఈజిప్టు సింగర్‌ పేరును ఊర్వశీ రౌటేలా చెప్పలేదు. కానీ ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలో 'అతని పేరు మహ్మద్‌ రమదాన్‌' అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఎందుకంటే 2021లో విడుదలైన 'వెర్సాస్‌ బేబీ' అనే మ్యూజిక్‌ వీడియోలో ఈజిప్షియన్ యాక్టర్‌, సింగర్‌ మహ్మద్ రమదాన్‌తో కలిసి ఊర్వశీ నటించింది. ప్రముఖ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం ఈ మ్యూజిక్‌ వీడియోలో ఊర్వశీ అత్యంత ఖరీదైన దుస్తులు వేసుకుందని సమాచారం. ఆమె దుస్తులకు రూ. 15 కోట్లు ఖర్చు అయ్యాని టాక్. 

చదవండి: చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు
నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్‌

మరిన్ని వార్తలు