హృతిక్‌ రోషన్‌ రికార్డులను బ్రేక్‌ చేసిన 'ఉప్పెన’

17 Feb, 2021 20:01 IST|Sakshi

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మెదటి రోజే ఈ మూవీ రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది.ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది.

 పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్‌ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే 14 ఏళ్లుగా ఆ రిక్డార్డును ఎవరూ టచ్‌ చేయలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. అంతేకాకుండా బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ రోషన్ రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఉప్పెన సినిమాతో  ఆల్‌ ఇండియా రికార్డులను  బ్రేక్‌ చేశాడు. హృతిక్ రోషన్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ సినిమా ఇండియా వైడ్‌గా రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ఇప్పుడు ఉప్పెన బద్దలుకొట్టింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఏప్పెన  రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. 

చదవండి : (గుడ్‌న్యూస్‌: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే.)

(Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు