‘వాలెంటైన్స్ నైట్’మూవీ రివ్యూ

27 Jan, 2023 12:39 IST|Sakshi

టైటిల్‌: వాలెంటైన్స్ నైట్
నటీనటులు: చైతన్య రావు, లావణ్య, సునీల్‌, పొసానికృష్ణ మురళి,  శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ తదితరులు
నిర్మాతలు: తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి, మహీంధర్ నారల
దర్శకుడు : అనిల్ గోపిరెడ్డి
సంగీతం: అనిల్ గోపిరెడ్డి
సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి

కథేంటంటే..
రేడియో జాకీగా పని చేసే అజయ్‌(చైతన్య రావు), ప్రియ(లావణ్య)ను సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. అయితే అనుకోకుండా వీరిద్దరికి బ్రేకప్‌ అవుతుంది. మరోవైపు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కృష్ణ (సునీల్) డ్రగ్స్ కి సంబధించిన వారిని పట్టుకుని ఎన్ కౌంటర్ చేస్తూ ఉంటాడు. ఈ డ్రగ్స్ దందాను నడుపుతున్న దాదా బ్యాచ్ ను పట్టుకోవడానికి విచారణ జరుపుతూ ఉంటాడు. అసలు ఈ దాదా ఎవరు ? వెనుక ఉండి ఈ డ్రగ్స్ దందాను ఎలా నడుపుతున్నాడు ? అజయ్‌, ప్రియ విడిపోవడానికి కారణం ఏంటి? చివరకు వారు ఎలా కలుసుకున్నారు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
మంచి సందేశం ఉన్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. డ్రగ్స్‌ వల్ల యూత్ ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారనే  ఒక సామాజిక సమస్యగా తీసుకుని... ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారు అనేది నిత్యం పరిశీలిస్తూ ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. అలాగే డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికే ఓ పారిశ్రామిక వేత్త... కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా ఉంటుందనే దాన్ని చక్కగా చూపించారు. దర్శకుడు అనిల్‌ గోపిరెడ్డి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు.  సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. కొన్ని  బోల్డ్ సీన్స్ యూత్ కి కనెక్ట్ బాగా కనెక్ట్‌ అవుతాయి. 

ఎవరెలా చేశారంటే..
ఆర్.జె. అజయ్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు చైతన్య రావు. తెరపై చాలా డీసెంట్‌గా కనిపిస్తాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కృష్ణగా సునీల్  టెర్రిఫిక్ గా కనిపించారు. లావణ్య నటన కూడా చాలా బాగుంది. . కట్టుకున్న భార్యను, కూతురుని వదిలేసి డబ్బు సంపాధనే ధ్యేయంగా బతికే ఓ బిజినెస్ మ్యాన్ గా శ్రీకాంత్ అయ్యంగార్ నటన ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన పోసాని కృష్ణ మురళి, అలాగే ఫ్రెండ్ పాత్రలో నటించిన రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. అనీల్ గోపిరెడ్డి నేపథ్య సంగీతం, పాటలు పర్వాలేదు. జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు