తొమ్మిదేళ్ల తరువాత పోటీలో విజయ్, అజిత్‌ చిత్రాలు 

29 Oct, 2022 08:51 IST|Sakshi

సినీ పరిశ్రమలో ఒక్కొక్క జనరేషన్‌లో ఇద్దరు ప్రముఖ హీరోల మధ్య పోటీతత్వం ఉంటోంది. ముఖ్యంగా తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్‌ మధ్య, ఆ తరువాత కమలహాసన్, రజనీకాంత్, తాజాగా విజయ్, అజిత్‌ మధ్య ఈ పోటీ సాగుతోందని చెప్పవచ్చు. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే వారి అభిమానులు మధ్య మాత్రం హోరా హోరీ పోరు సాగుతుంటుంది. విజయ్, అజిత్‌ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2001 విజయ్‌ నటించిన ప్రెండ్స్, అజిత్‌ నటించిన దిన చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. అలాగే 2007లో విజయ్‌ నటించిన జిల్లా, అజిత్‌ నటించిన ఆల్వార్‌ చిత్రాలు పోటీ పడ్డాయి.

ఇక 2014లో విజయ్‌ నటించిన పోకిరి, అజిత్‌ నటించిన వీరం చిత్రాలు బరిలోకి దిగాయి. ఆ తరువాత ఇప్పటివరకు వీరిద్దరూ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదల కాలేదు. అలాంటిది తొమ్మిదేళ్ల తరువాత ఈ సంక్రాంతికి విజయ్‌ నటిస్తున్న వారీసు, అజిత్‌ నటిస్తున్న తుణివు చిత్రాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం వారీసు. నటి రష్మిక మందన నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. దీని తమిళనాడు విడుదల హక్కులను నిర్మాత లలిత్‌కుమార్‌ పొందారు.

ఇక అజిత్‌ హీరోగా నటిస్తున్న హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. నటి మంజు వారియర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీని తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్‌ మూవీస్‌ సంస్థ పొందింది. దీంతో మరోసారి విజయ్, అజిత్‌ అభిమానుల మధ్య పోరు తప్పడం లేదు. వారి విషయాన్ని పక్కన పెడితే ఇద్దరు స్టార్‌ హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలైతే వసూళ్లకు ముప్పు ఏర్పడుతుందని ఎగ్జిబిటర్లు, డి  ్రస్టిబ్యూటర్లు భయపడుతున్నారు.

మరిన్ని వార్తలు