సినిమాకు ఎల్లలు లేవు – శివ కార్తికేయన్‌ 

9 Oct, 2021 08:07 IST|Sakshi

‘‘థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, చప్పట్లే నాకు ప్రేరణ.. రెండేళ్లుగా వాటిని మిస్‌ అవుతున్నా. ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో మీ చప్పట్లు, ఈలలు వింటుంటే సంతోషంగా ఉంది. సినిమాకు ఎల్లలు లేవు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హీరో శివ కార్తికేయన్‌ అన్నారు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జంటగా నటించిన చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. కోటపాడి జే రాజేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ‘‘మా సినిమాలో చాలా వినోదం ఉంది’’ అన్నారు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. ‘‘ఈ చిత్రంలో యాక్షన్, థ్రిల్, కామెడీ, మంచి కథ, కథనం ఉన్నాయి’’ అన్నారు గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మహేశ్వర్‌ రెడ్డి. ‘‘ఈ చిత్రంలో నటించడం గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రియాంకా అరుల్‌ మోహన్‌. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ కార్తీక్‌ కణ్ణన్, సంగీతం: అనిరుధ్‌.  

మరిన్ని వార్తలు