వెల్‌కమ్‌ బావా: వరుణ్‌ తేజ్‌

14 Aug, 2020 10:45 IST|Sakshi

‘‘డియర్‌ చై... దాదాపు అన్ని విషయాల్లో తను అచ్చం నాలాగే ఉంటుందని అంతా అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా నువ్వు తనపై కురిపిస్తావని నమ్ముతున్నాను’’ అంటూ నటుడు కొణిదెల నాగబాబు తనకు కాబోయే అల్లుడు చైతన్యను ఉద్దేశించి ఆత్మీయ ట్వీట్‌ చేశారు. ‘‘ఈరోజు నుంచి తను అధికారికంగా నీ‘సమస్య’గా మారిపోయింది’’ అని చమత్కరించారు. ఇక నిహారిక తోబుట్టువు, సినీ హీరో వరుణ్‌ తేజ్‌ సైతం కాబోయే బావగారిని కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ట్వీట్‌ చేశాడు. ‘‘ఈరోజు జరిగింది!! నా బేబీ సిస్టర్‌ ఎంగేమెంట్‌ అయ్యింది. కుటుంబంలోకి స్వాగతం బావా’’ అంటూ నిహారిక- చైతన్యల ఫొటోను షేర్‌ చేశాడు.(నిహారికా ఎంగేజ్డ్‌)

కాగా నటి, నాగబాబు కుమార్తె నిహారిక- గుంటూరుకి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు వెంకట చైతన్యల వివాహ నిశ్చితార్థం గురువారం జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా