Sir Movie: సీక్వెల్‌ ఆలోచన లేదు.. దర్శకుడు వెంకీ అట్లూరి

19 Feb, 2023 02:31 IST|Sakshi

‘‘సార్‌’ సినిమాకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్‌ అవుతారు. ఈ సినిమా చూసిన తర్వాత విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతుంది. మనసున్న ప్రతి మనిషి కీ ‘సార్‌’ సినిమా నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘సార్‌’ (తమిళంలో ‘వాతి’). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది.

‘సార్‌’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ లభిస్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రదర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘చదువు అనేది నిత్యావసరం. అందుకే ‘సార్‌’ సినిమా బ్యాక్‌డ్రాప్‌ 1990 అయినప్పటికీ ఇప్పటి ఆడియన్స్‌ కూడా కనెక్ట్‌ అవుతారనిపించింది. ధనుష్‌గారికి మా నిర్మాత ‘సార్‌’ కథ చెప్పమనగానే హ్యాపీ ఫీలయ్యాను.

కథ విన్నాక ధనుష్ గారు చప్పట్లు కొట్టి, కాల్షీట్స్‌ ఎప్పుడు కావాలని అడగటంతో ఇంకా హ్యాపీ ఫీలయ్యాను. ఇందులో తండ్రీకొడుకుల మధ్య మంచి సీన్‌ ఉంటుంది. అది త్రివిక్రమ్‌గారితో జరిపిన సంభాషణల నుంచే పుట్టింది. ‘సార్‌’ యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. తమిళంలోనూ మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఆలోచన లేదు. ఇక నుంచి నా ప్రతి సినిమాకీ వైవిధ్యం చూపించడంతో పా టు విభిన్న జోనర్లలో చిత్రాలు చేస్తాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు