పెళ్లికి డబ్బులు కూడబెట్టుకుంటున్నాం!

29 Jun, 2021 00:02 IST|Sakshi
విఘ్నేశ్‌ శివన్, నయనతార

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్, నయనతార ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? విఘ్నేశ్‌ ఫేవరెట్‌ హీరోయిన్‌ నయనతార కాదు.. మరి ఎవరు? నయనకు విఘ్నేశ్‌ ఇచ్చిన తొలి బహుమతి ఏంటి?... ఇలాంటి ఆసక్తికరమైన నెటిజన్ల ప్రశ్నలకు విఘ్నేశ్‌ శివన్‌ సరదాగా క్లారిటీ ఇచ్చారు. కాబోయే భార్య నయనతార గురించి విఘ్నేశ్‌ శివన్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే చదివేయండి.

నేనొక దర్శక నిర్మాత అయినప్పటికీ నెటిజన్లు ఎక్కువగా నా విషయాలను కాకుండా నయనతార గురించే ప్రస్తావించడం నాకు అసూయగా లేదు. నిజం చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది.
నయనతారతో కలిసి నాకూ సిల్వర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనే ఉంది. కానీ ఈ విషయంలో తనవైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు.
మా డిన్నర్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత రోజూ నయనతారే ఆ పాత్రలను శుభ్రపరుస్తుంది. ఘీ రైస్, చికెన్‌ కర్రీ బాగా వండుతుంది తను.
నయనతార నటించిన చిత్రాల్లో ‘రాజా–రాణి’ నా ఫేవరెట్‌


నయనతో నేను కలిసి ఉన్న ప్రతీ ప్లేస్‌ నా ఫేవరెట్‌ స్పాటే.
నా ఫేవరెట్‌ హీరోయిన్‌ మోనికా బెల్లూచి (ఇటాలియన్‌ నటి).
నయనతార చాలా అందంగా ఉండటానికి ఆమె చేస్తున్న ప్రార్థనలే ముఖ్య కారణం
నయన నటించిన ‘నానుమ్‌ రౌడీదాన్‌’ చిత్రంలో ‘తంగమే’ (బంగారమే...) పాటకు లిరిక్స్‌ రాశాను. ఆమెకు నేను ఇచ్చిన తొలి బహుమతి ఈ పాట అని అనుకుంటాను. 
పెళ్లంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే డబ్బులు కూడబెడుతున్నాం. అలాగే కరోనా పరిస్థితులు పూర్తిగా సమసిపోయిన తర్వాత నేను, నయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాం.  


నా లైఫ్‌లో నయనతార తల్లి కురియన్‌ వన్నాఫ్‌ ది బెస్ట్‌ పర్సన్స్‌.
వెస్ట్రన్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌లో కన్నా నయనతార చీరకట్టులోనే చాలా బాగుంటుంది.
నేను దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’ షూటింగ్‌ ఇంకా 15 రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. (ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు).

చదవండి: (చూపు కోల్పోయిన కత్తి మహేశ్‌?) 

మరిన్ని వార్తలు