‘విజయ రాఘవన్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

17 Apr, 2021 11:38 IST|Sakshi

‘బిచ్చగాడు, కిల్లర్‌’ చిత్రాల ఫేమ్‌ విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇందులో ఆత్మిక హీరోయిన్‌గా నటించారు. ఆనంద్‌ కృష్ణన్‌  దర్శకత్వంలో టీడీ రాజా, డీఆర్‌ సంజయ్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘విజయ రాఘవన్‌ ’ చిత్రాన్ని మే 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ – ‘‘ఓ మాస్‌ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే యువకుడి కథే ‘విజయ రాఘవన్‌ ’. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌  కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 14న తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు