-

విదేశాలకు ఫ్యామిలీస్టార్‌

27 Nov, 2023 02:35 IST|Sakshi
విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూ

విదేశాలకు పయనం అవనున్నారు ఫ్యామిలీస్టార్‌. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. ఈ సినిమా చిత్రీకరణ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విజయ్, మృణాల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ అమెరికాలో జరగనుందని తెలిసింది.

నెలరోజులకుపైగా అక్కడి లొకేషన్స్‌లో జరిగే ఈ భారీ షెడ్యూల్‌తో ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ పూర్తి కానున్నట్లుగా తెలుస్తోంది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ‘ఫ్యామిలీస్టార్‌’ తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదని, మార్చిలో రిలీజ్‌ కానుందనే టాక్‌ లేటెస్ట్‌గా వినిపిస్తోంది. ఈ సినిమాలో రష్మికా మందన్నా ఓ అతిథి పాత్ర చేస్తున్నారని భోగట్టా. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు