విజయ్‌ ‘మాస్టర్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

29 Dec, 2020 15:59 IST|Sakshi

లాక్‌డౌన్‌ అనంతరం సినిమా థియేటర్లు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. మొన్నటి వరకు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యినప్పటికీ ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోనే హడావిడి చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ముందడుగు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మ‌ర్డ‌ర్, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల అయ్యాయి. మ‌రోవైపు థియేట‌ర్ల‌లో విడుద‌లైన చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న కూడా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మిగిలిన వారు కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తలపతి విజయ్‌ నటిస్తోన్న యాక్షన్‌ మూవీ మాస్టర్‌ ​సంక్రాంతి బరిలో దిగనుంది. 2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా మాస్టర్‌ థియేటర్లలలో సందడి చేయనుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు దర్శకుడు మంగళవారం ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు. తమిళం‌తో పాటు తెలుగు భాషల్లో కూడా మాస్టర్ ఒకేసారి విడుదల అవుతుంది. హిందీలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్‌ అవ్వనుంది. చదవండి: సీఎంతో హీరో విజయ్‌ భేటీ..!

ఖైదీ ఫేమ్ లోకేశ్‌ కనగరాజన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్టర్‌లో విజయ్‌కు జోడిగా మాళవిక మోహన్ నటిస్తున్నారు. మరో నటుడు విజయ్‌ సేతుపతి పవర్‌ఫుల్‌ విలన్‌పాత్రలో కనిపించనున్నాడు. ఆండ్రియా జెరెమియా, రమ్య సుబ్రమణియన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్, నాసర్, ధీనా, సంజీవ్, శ్రీనాథ్, శ్రీమాన్, సునీల్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 9 న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఇక మాస్టర్‌ విడుదల తేదీ ప్రకటించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమాతోపాటు  యువ హీరో రామ్ రెడ్ మూవీ  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న థియేట‌ర్ల‌లో రాబోతోంది. అలాగే బెల్లంకొండ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన అల్లుడు అదుర్స్ కూడా సంక్రాంతి బ‌రిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. చదవండి:అభిమానులకు రకుల్‌ గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు