కొడుకుతో నటి ఫొటో.. చీవాట్లు, చీదరింపులు!

10 Jul, 2021 08:45 IST|Sakshi

Actress Vijayalakshmi: తమిళ దర్శకుడు అగత్యన్‌ రెండో కుమార్తె, నటి విజయలక్ష్మి తాజాగా సోషల్‌ మీడియాలో తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. దీనికి "మమ్మీ... ఐ లవ్‌ యూ.. అతి పెద్ద గ్రహమైన బృహస్పతి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా.." అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో ఆమె తన కొడుక్కి ప్రేమగా ముద్దు పెట్టింది. అయితే ఆమె తన కొడుకు పెదాల మీద ముద్దివ్వడం నెటిజన్లకు పెద్దగా నచ్చినట్లు లేదు.

దీంతో కొందరు ఆమెకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పెడుతున్నారట. నీ పద్ధతేమీ బాగోలేదని విమర్శిస్తూ, చీదరించుకుంటూ చీవాట్లు పెడుతున్నారట. దీంతో ఆమె ఈ ట్రోలింగ్‌కు ఘాటుగా బదులిచ్చింది. 'దీని వెనకాల కూడా ఏమైనా సిద్ధాంతాలుంటాయా? ఈ ఫొటో చూడగానే చెడిపోతారా? ఆపండెహె' అంటూ ట్వీట్‌ చేసింది. ఆమె అభిమానులు మాత్రం తల్లీకొడుకుల ఫొటో భలే ముద్దొస్తుంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా విజయలక్ష్మి 'చెన్నై 600028' సినిమాతో పాటు దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'అంజాతే'లోనూ సహజ నటనతో మెప్పించింది. తను ఎంతగానో ప్రేమిస్తున్న ఫిల్మ్‌ మేకర్‌ ఫిరోజ్‌ను పెళ్లాడిన విజయలక్ష్మి వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తోంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కొడుకున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు