బూతులు మాట్లాడను, ఎక్స్‌పోజింగ్‌ చేయను: ఖత్తర్‌ పాప

12 Apr, 2021 20:54 IST|Sakshi

టిక్‌టాక్‌ యాప్‌.. అప్పట్లో దీని హవా మామూలుగా ఉండేది కాదు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు అందరూ ఇదే యాప్‌ వాడేవారు. అలా చాలామంది ఫేమస్‌ అయ్యారు కూడా. అందులో కత్తర్‌ పాప అలియాస్‌ షాలిని బుజ్జి ఒకరు. కానీ అందరిదీ ఒక రూటైతే ఈమెది మాత్రం సెపరేట్‌ రూట్‌. ఓ వైపు అమాయకంగా మాట్లాడుతూనే మరో పక్క బండబూతులు తిట్టేది. దీంతో కొందరు ఆమెను కావాలని రెచ్చగొట్టి పచ్చిబూతులు మాట్లాడేలా చేసేవారు. అలా ఆ వీడియోలను పని గట్టుకుని మరీ వైరల్‌ చేశారు. తర్వాత ఆమె కూడా ఇలా తిట్టడం వల్ల ఫేమస్‌ అవుతుండటంతో దాన్నే కంటిన్యూ చేసింది.

అయితే తనను కావాలనే ఇలా చేశారని చెప్తున్న షాలిని.. ఇకపై బూతులు మాట్లాడనని చెప్తోంది. తనకు సినిమా ఛాన్స్‌ వచ్చిందని ఎగిరి గంతేస్తోంది. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. "ఆంధ్రా పాప లేదు, కత్తర్‌ పాప లేదు, తొక్క పాప లేదు.. నా పేరు షాలినీ బుజ్జి. నాకు సినిమాలో అవకాశం వచ్చింది. అగ్రిమెంట్‌ మీద సంతకం కూడా చేశాను. రెండు ఐటమ్‌ సాంగ్స్‌ కూడా ఇచ్చారు. ఈ సినిమా వల్ల మంచి పేరు కూడా వస్తుందట. నేను చాలా మారిపోతాను ఫ్రెండ్స్‌.. ఇక నుంచి బూతులు తిట్టను, ఎక్స్‌పోజింగ్‌ వీడియోలు చేయను. నేనేంటో మీ అందరికీ చూపిస్తాను. నన్నెవరు తిట్టుకున్నా, కుళ్లుకుని చచ్చిపోయినా పట్టించుకోవద్దని చెప్తున్నారు దర్శకనిర్మాతలు. నేను చాలా అదృష్టవంతురాలిని" అంటూ చెప్పుకొచ్చింది.

పనిలో పనిగా తాను నటించబోయే సినిమాలో డైలాగ్‌ కూడా చెప్పింది షాలిని. 'నా హైటూ వెయిటూ చూసి ముందుకు రాకు.. నన్ను కాటేస్తే..' అంటూ మధ్యలోనే డైలాగ్‌ ఆపి మిగతాది సినిమాలో చూడండి అని తెగ సిగ్గుపడిపోయింది. ఇంతకీ ఆమె చేస్తుంది ఏం సినిమా? ఎవరితో? ఎప్పుడు? డైరెక్ట్‌ ఎవరు? అన్న వివరాలు ఏవీ చెప్పలేదు. మరి ఈ షాలినికి నిజంగానే సినిమా ఛాన్స్‌ వచ్చిందా? అనేది త్వరలోనే తెలుస్తుందేమో చూడాలి.

చదవండి: ఆహాలో హౌస్‌ఫుల్‌.. ఈ నెలలో రిలీజయ్యే సినిమాలివే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు