సుకుమార్‌ కుమార్తె ఫంక్షన్‌ : టాలీవుడ్‌ స్టార్స్‌ తళుక్కు

25 Feb, 2021 12:48 IST|Sakshi

సుకుమార్‌ కుమార్తె ఫంక్షన్‌లో టాలీవుడ్‌ తారల తళుక్కు

స్టార్‌ కపుల్స్‌  సందడి, ఫోటోలు వైరల్‌

యంగ్‌ లుక్‌లో తండ్రి నాగ్‌ని తలపిస్తున్న చే

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు సుకుమార్ కూతురి వేడుక‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంద‌డి ఆసక్తికరంగా మారంది. మహేష్ బాబు ఫ్యామిలీ,నాగ చైతన్య ఫ్యామిలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తదితర ప్రముఖులు ఈ ఫంక్షన్‌లో తళుక్కున మెరిసారు. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, నమ్రత, అక్కినైని నాగ చైతన్య, సమంత, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి దంపతుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.  తండ్రి, టాలీవుడ్‌ మన్మధుడు,  అక్కినేని నాగార్జునను తలపించేలా యువ సామ్రాట్‌ చైతూ లుక్ అందరిని కట్టిపడేస్తుంది. క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్న చే లుక్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ప్రిన్స్‌ మహేశ్‌, ఎన్టీఆర్‌‌ కూడా తనదైన స్టయిల్‌లో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ఖాతాల్లో అభిమానులు  తెగ షేర్‌ చేస్తున్నారు.

కాగా సుకుమార్ ప్రస్తుతం స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 


 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు