వైరల్‌: భర్త చెంప పగలగొట్టిన నటి

24 May, 2021 09:51 IST|Sakshi

బుల్లితెర సెలబ్రిటీ అనిత తన భర్త రోహిత్‌ రెడ్డిని ఓ ఆటాడుకుంది. జస్ట్‌ ప్రాంక్‌ అని చెప్తూ భర్త చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అనిత తన భర్తను కుర్చీలో కూర్చోబెట్టింది. అతడి వెనకాల నిలబడిన ఆమె తన చేతిలో ఓ దారాన్ని పట్టుకున్నట్లు నటించింది. దాన్ని అతడి చెవిలో నుంచి తీసినట్లు యాక్ట్‌ చేసింది. ఇంతలో ఫడేలుమని చెంప మీద ఒక్కటిచ్చింది. దీంతో షాకైన భర్త తనను ఏమీ అనలేక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. భార్యలకు ఈ మ్యాజిక్‌ ట్రిక్‌ తప్పకుండా నచ్చుతుందన్న అనిత 'ఈ ట్రిక్‌ను తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి' అని వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చింది.

అయితే తనను ఇలా ఆడేసుకున్న భార్యను ఊరుకునేది లేదంటున్నాడు రోహిత్‌. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక అనిత తన భర్తను ఈ రకంగా ఆటపట్టించడం చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పాపం, రోహిత్‌ ముఖం మాడిపోయిందని అంటున్నారు. అతడు ఎలా రివేంజ్‌ తీసుకుంటాడా అని ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. 'నువ్వు నేను', 'శ్రీరామ్‌', 'నేనున్నాను' వంటి చిత్రాల్లో నటించిన అనిత 2013లో రోహిత్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక వివాహం అనంతరం బాలీవుడ్‌లో పాగా వేసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. 

చదవండి: బాలీవుడ్‌లో హీరోయిన్‌ ప్రణీతకు చేదు అనుభవం!

ఒంటిపై తేనెటీగలతో హీరోయిన్‌ ఫోటో షూట్‌.. వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు