విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన విశ్వక్‌ సేన్‌

4 May, 2021 14:13 IST|Sakshi

టాలీవుడ్‌ ఈ యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ, విశ్వక్‌ సేన్‌ల మధ్య ఇటీవల ఓ వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. విశ్వక్‌ నటించిన ఫలక్‌నుమా దాస్‌ మూవీ ఫ్రీ ఫంక్షన్‌ సమయంలో విశ్వక్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి తెరలేపాయి. ఈ వేడుకలో విశ్వక్‌ తన మూవీ ప్రమోషన్‌లో భాగంగా ‘ఇప్పటికే ఒకడ్ని లేపినం.. మళ్లీ వీన్నేక్కడ లేపాల్రా నాయనా అనుకుంటున్నారేమో.. నన్నేవడూ లేపాల్సిన అవసరం లేదు.. నన్ను నేనే లేపుకుంటానంటూ’ వ్యాఖ్యానించడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

తమ హీరో విజయ్‌ని ఉద్దేశిస్తూ విశ్వక్‌ ఆ వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్‌ మీడియాలో విజయ్‌ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రచ్చ కాస్తా ఇటూ విజయ్‌ అభిమానులు, అటూ విశ్వక్‌ ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వాగ్వాదానికి దారితీయడంతో ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే దీనిపై విజయ్‌ కానీ, విశ్వక్‌ కానీ స్పందించకపోవడం గమనార్హం. ఇక ఈ వివాదం జరిగిన ఇన్నాళ్లకు తాజాగా హీరో విశ్వక్‌ సేన్‌ స్పందించాడు. సోమవారం ఓ టీవీ షోలో పాల్గొన్న విశ్వక్‌ దీనిపై క్లారిటి ఇచ్చాడు. ఫలక్‌నుమా దాస్ టైమ్‌లో ఓ నిర్మాత తనని ఉద్దేశిస్తూ వీన్ని తొక్కండ్రా అన్నాడని, దీంతో అప్పటి వరకు పడిన కష్టమంతా వృథా అయిపోతుందేమో అని భయంతో ఆ కంగారులోనే స్టేజీపై అలా మాట్లాడాను తప్పా ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశాడు.

అయితే అది చూసి కొంతమంది సోషల్‌ మీడియాలో తమ నచ్చిన్నట్లుగా రాశారని, దానికి మరింత మాసాలా జోడించడంతో ఈ సంఘటన మరింత హైలైడ్‌ అయ్యిందంటూ చమత్కరించాడు. ఆ రోజు విజయ్‌ దేవరకొండ ఉద్దేశిస్తూ ఒక్క మాట కూడా అనలేదని తెలిపాడు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్‌ హీరో వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి అర్జున్‌ రెడ్డి, గీతా గోవింద లాంటి హిట్‌ సినిమాలతో విజయ్‌ ఇప్పటికే మార్కెట్‌ను పెంచుకొని ఇప్పుడు పాన్‌ ఇండియా నటుడిగా ఎదిగాడు. మరో వైపు వెళ్లిపోమాకే లాంటి మూవీతో పరిచమైన కుర్ర హీరో విశ్వక్‌.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్‌ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటివల అతడు నటించిన హట్‌ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వెసుకుని దూసుపొతున్నాడు. 

చదవండి: 
గజినీ సీక్వెల్‌లో అల్లు అర్జున్‌!
అతడితో సీక్రెట్‌ డేటింగ్‌ చేస్తోన్న యాంకర్‌ వర్షిణి!
కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్‌.. కారణం ఇదేనట

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు