వ్యక్తుల సంఘర్షణే వ్యూహం

14 Oct, 2023 00:20 IST|Sakshi
దాసరి కిరణ్‌ కుమార్, రామ్‌గోపాల్‌ వర్మ

రామ్‌గోపాల్‌ వర్మ

‘‘నాకు టీడీపీ గురించి తెలియదు. వైసీపీ గురించి తెలియదు. నేను రాజకీయాలు ఫాలో కాను. ఈ ‘వ్యూహం’ చిత్రానికి పార్టీలకు, ప్రభుత్వాలకు  సంబంధం లేదు. ఇది కేవలం వ్యక్తుల మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్‌ (సంఘర్షణ)’’ అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రధారులుగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా పోలిటికల్‌ చిత్రం ‘వ్యూహం’.

ఈ సినిమా రెండో భాగం ‘శపథం’. రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించిన ‘వ్యూహం’ సినిమా నవంబరు 10న, ‘శపథం’ చిత్రం జనవరి 25న విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వ్యూహం’ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుకలో రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘వాస్తవ సంఘటనలు, వాటి తాలూకు పాత్రల పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది.

నా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో దాదాపు 80 శాతం వరకు ఏదో ఒక సంఘటన నుంచి స్ఫూర్తి ΄పొందినవే ఉంటాయి’’ అన్నారు. దాసరి కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ –‘‘ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ అంశాలను ΄పొందుపరిచి ఓ సందేశంగా.. సినిమాగా చెప్పాలనిపించి, సమయానుకూలంగా ‘వ్యూహం’ని ఇప్పుడు నిర్మించి, విడుదల చేస్తున్నాం. ఇది బయోపిక్‌ కాదు. ఈ సినిమాని చాలా పెద్ద స్థాయిలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఐదు లక్షల మందితో నవంబరు 5న ప్రీ రిలీజ్‌ వేడుకను భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు