శేఖర్‌ కమ్ముల సినిమా: ధనుష్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే..!

19 Jun, 2021 15:47 IST|Sakshi

కోలివుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దినికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు... శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

ఎవరు ఊహించని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అప్పుడే పుకార్లు మొదలయ్యాయి. ఈ మూవీ కోసం ధనుష్‌ భారీ రెమ్యునరేషన్‌ తీసుకోతున్నాడని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.  ఈ సినిమాకు గాను ధనుష్ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియ రావట్లేదు. 

ఇక ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ధనుష్‌ బాలీవుడ్‌లో ‘అత్రాంగి రే’, హాలీవుడ్‌లో ‘ది గ్రే మ్యాన్‌’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే శేఖర్‌ కమ్ముల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. 
చదవండి:
శేఖర్‌ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్‌
ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ : కీలక పాత్రలో 'జయమ్మ'

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు