ఈ పాట మెగాభిమానులకు అంకితం

3 Sep, 2020 02:10 IST|Sakshi
ప్రభు, తమ్మారెడ్డి భరద్వాజ, కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్, ర్యాప షకీల్‌

ప్రముఖ సినీ జర్నలిస్ట్‌ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్‌ గోపాల్‌ వర్మ’. నటుడు ‘షకలక’ శంకర్‌ టైటిల్‌ పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆడియోను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రభు ఎంతో ఆవేదనతో, ధర్మాగ్రహంతో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ చేరువ కావాలి’’ అన్నారు.

దర్శక–నిర్మాత ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం నేను స్వయంగా రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్‌ గోపాల్‌ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా నీ ఖర్మ..’ అనే పాటని ర్యాప్‌ షకీల్‌ చక్కగా పాడటంతో పాటు మా చిత్రానికి సంగీతం అందించాడు. ఈ పాటను మెగాభిమానులకు, ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ ఫ్యా¯Œ ్సకు అంకితం చేస్తున్నాను. అందుకే పవన్‌ పుట్టినరోజున ఈ పాటను విడుదల చే శాం. చిత్తూరు జిల్లాలో విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన ముగ్గురు పవన్‌ అభిమానులకు మా చిత్రం ద్వారా వచ్చే ఆదాయంలో పావు వంతు వారి కుటుంబాలకు అందిస్తాం’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు ర్యాప్‌ షకీల్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు