‘అతడు ఆమె ప్రియుడు’కు విజయం తధ్యం

30 Jan, 2022 14:29 IST|Sakshi

సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’.సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ చిత్ర ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్‌. 

 నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకులు దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో... చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి వడ్డి, ఈ చిత్రానికి ఛాయాగ్రహణంతోపాటు ఎడిటింగ్ చేసిన మీర్ పాలుపంచుకున్నారు. రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి.... దర్శకుడిగాను "అతడు ఆమె ప్రియుడు" చిత్రంతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని అతిధులు ఆకాంక్షించారు. 

‘అతడు ఆమె ప్రియుడు’చిత్రం కోసం యండమూరి ఎంతో శ్రమించారని, సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. యండమూరితో మరికొన్ని చిత్రాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. "అతడు ఆమె ప్రియుడు" చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు