క్షయ రహిత సమాజం అందరి బాధ్యత

25 Mar, 2023 01:28 IST|Sakshi
ర్యాలీ ప్రారంభిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌

నారాయణపేట రూరల్‌: సమాజంలో క్షయవ్యాధిని పూర్తిగా రూపుమాపేందుకు కృషిచేద్దామని అడిషనల్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ ఆద్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షయవ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి సరైన రీతిలో మందులు వాడితో త్వరగా నివారించవచ్చన్నారు. రెండు వారాల పాటు దగ్గు, జ్వరం, చమట, బరువు తగ్గటం, తెమడలో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రాంమనోహర్‌రావు, డాక్టర్‌ శైలజ, అశోక్‌, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

సమయాన్ని వృథా చేసుకోవద్దు

మాతృభాషతో పాటు ఆంగ్ల పరిజ్ఞానం ఎంతో అవసరమని, అందుకు ప్రతి విద్యార్థి తప్పకుండా బాధ్యతగా చదవాలని, సమయాన్ని వృథా చేసుకోవద్దని అడిషనల్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌ అన్నారు. నారాయణపేట ఎడ్యుకేషనల్‌ ఎంపవర్మెంట్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఈఈడీఏ) ఆధ్వర్యంలో ఇటీవల 13మండలాల్లో నిర్వహించిన ఇంగ్లిష్‌ వెకాబులరీ టెస్ట్‌ తరగతుల వారీగా క్లస్టర్‌ టాపర్లకు జిల్లా స్థాయి పోటీలను శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆంగ్లంపై పట్టు సాధిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, అందించారు. డీఈఓ లియాకత్‌అలీ, ఏఎంఓ విద్యాసాగర్‌,రమేష్‌శెట్టి, నిజాముద్దిన్‌, నరేందర్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు