రామ్‌లీలా ప్రదర్శనతో అలరించిన రష్యన్లు

23 Oct, 2022 14:27 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి ముందు రోజు నిర్వహించనున్న దీపోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 12 మంది రష్యన్‌ కళాకారుల బృందం రామలీలాను ప్రదర్శించింది. ఈ మేరకు శనివారం రష్యన్‌ కళాకారుల బృందం సాంప్రదాయ దుస్తులతో వేషాలు వేసుకుని రామలీలా ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. మాస్కోలోని ఇండియా రష్యా ఫ్రెండ్‌షిప్‌ సొసైటీ అధ్యక్షుడు పద్మశ్రీ గెన్నాడి మిఖైలోవిచ్‌ పెచ్చికోవ్‌ మెమోరియల్‌ ఆధ్వర్యంలో రష్యా కళాకారుల బృందం ప్రదర్శన ఇచ్చింది.

ఈ క్రమంలో ప్రదర్శన దర్శకుడు, నిర్మాత రామేశ్వర సింగ్‌ మాట్లాడుతూ...యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తమకు రష్యన్‌ బృందం చేత రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించేలా భారత్‌లో ఒక వేదికను అందించారని అన్నారు. 1960 నుంచి రష్యాలో రామ్‌లీలా చాలా ప్రముఖంగా ప్రదర్శించబడుతున్నట్లు సింగ్‌ తెలిపారు. వారందరికి భాష కష్టం కాలేదు గానీ పాత్రలను పోషించడంలో ఇబ్బంది పడినట్లు తెలిపారు.

ఈ మేరకు ఒక రష్యన్‌ నటి మాట్లాడుతూ తాను సీతగా నటించడాని సుమారు మూడు నెలలు ప్రాక్టీస్‌ చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు దీపావళి రోజున జరిగే దీపోత్సవ్‌ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా 15 లక్షలకు పైగా దీపాలను వెలిగించనున్నారు. దీన్నీ వీక్షించేందుకు ప్రధాని మోదీ కూడా ఆదివారం అయోధ్య సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల  సమాచారం. 

(చదవండి: మహిళపై మంత్రి చేతివాటం ... తర్వాత పాదాలను తాకి...)

మరిన్ని వార్తలు