Encounter: చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌

27 Dec, 2021 13:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాయ్‌పూర్‌: చత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుర్నవల్లి, పెసరపాడు అడవుల్లో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు పోలీసులకు రాత్రి నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మావోయిస్టుల మృతదేహాల తరలింపుపై డైలామా కొనసాగుతోంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించాలా..లేక వరంగల్ ఎంజీఎంకు తరలించాలా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది.
చదవండి: హైదరాబాద్‌లో అమానుషం: అన్నను కొట్టి చంపిన తమ్ముడు 

>
మరిన్ని వార్తలు