అరెస్టైతే వర్క్‌​ ఫ్రమ్‌ జైల్‌ చేయండి: కేజ్రీవాల్‌తో ఆప్‌ ఎమ్మెల్యేలు!

6 Nov, 2023 20:16 IST|Sakshi

న్యూ ఢిల్లీ : ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను లిక్కర్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ఎదుర్కొనున్నారు. ఒకవేళ ఆయన గనుక అరెస్ట్‌ చేస్తే సీఎంగా వర్క్‌​ ఫ్రమ్‌ జైల్‌ (జైలు నుంచే పని) చేస్తారని ఢిల్లీ మంత్రి ఆతిషి చెబుతున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్ల నేపథ్యంలో కేజ్రీవాల్‌ సోమవారం ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, ఇందుకే మీరు జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయవద్దని ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ అరెస్ట్‌ అయితే పదవికి రాజీనామా చేయొద్దని.. జైలు నుంచే సీఎంగా పని చేయాలని కేజ్రీవాల్‌ మీటింగ్‌లో విజ్ఞప్తి చేసినట్లు ఆతిషి వెల్లడించారు. జైలులోనే కేబినెట్‌ మీటింగ్‌ పెట్టుకునేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకుంటామని చెప్పారు. 

లిక్కర్‌ స్కామ్‌లో ప్రశ్నించేందుకుగాను ఈ నెల 2న తమ ముందు హాజరవ్వాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ విచారణకు కేజ్రీవాల్‌ హాజరుకాలేదు. దీంతో అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు