ఎయిరిండియాకు 6,500 మంది పైలట్లు కావాలి

18 Feb, 2023 05:21 IST|Sakshi

ఎయిర్‌బస్, బోయింగ్‌ నుంచి 470 విమానాల కొనుగోలు  

ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్‌బస్, బోయింగ్‌ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విమానాలు నడిపించడానికి 6,500 మందికిపైగా పైలట్లు అవసరమని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 113 విమానాలు ఉన్నాయి. దాదాపు 1,600 మంది పైలట్లు పనిచేస్తున్నారు.

పైలట్ల కొరత వల్ల ఇటీవల పలు సందర్భాల్లో అల్ట్రా–లాంగ్‌ హాల్‌ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాల ప్రయాణాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌ ఆసియా ఇండియాలో 54 ఫ్లైట్లు ఉండగా, దాదాదాపు 850 మంది పైలట్లు సేవలందిస్తున్నారు. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో 53 విమానాలు, 600 మందికిపైగా విమాన చోదకులు ఉన్నారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌ ఆసియా ఇండియా, విస్తారా సంస్థల్లో కలిపి 220 విమానాలు ఉన్నాయి. 3,000 మందికిపైగా పైలట్లు పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు