Chennai Cyclone Michaung: మిచాంగ్‌ తుపాన్‌.. చెన్నై విలవిల

4 Dec, 2023 14:05 IST|Sakshi

సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మిచాంగ్‌ తుపాన్‌గా మారటంతో చెన్నై, శివారు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణగా రిజర్వాయర్లు, చెరువులు నిండు కుండలుగా మారాయి. దీంతో అధికార యంత్రాంగం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. సోమవారం చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు పబ్లిక్‌ హాలిడే ప్రకటించారు. తుపాన్‌ తీరం దాటే వరకు జనం ఇళ్ల నుంచి అనవసరంగా బయటకు రావద్దనే హెచ్చరికలు జారీ అయ్యాయి.


 

చెన్నై నగరంలో భారీ వార్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపో​యాయి. రోడ్లపై మోకాలు వరకు నీరు చేరుకుంది. దీంతో రోడ్లపై రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెంగల్పట్టు సమీపంలోని సముద్రతీర ప్రాంతం నుంచి వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.


 

చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు కాలువలా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నిలిచి ఉన్న కార్లు వాన నీటిలో కొట్టుకుపోతున్నాయి.


 

>
మరిన్ని వార్తలు