మోదీ కీలక నిర్ణయం.. అమూల్‌,పెప్సీ, కోకాకోలాకు టెన్షన్‌

9 Jun, 2022 16:07 IST|Sakshi

ప్లాసిక్ట్‌ రహిత సమాజం కోసం ప్రభుత్వాలు కొన్ని నిర‍్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర‍్ణయం తీసుకుంది. జూలై ఒక‌టో తేదీ నుంచి ప్లాస్టిక్ స్ట్రాల‌ను బ్యాన్ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. 

వివరాల ప్రకారం.. ప్లాస్టిక్‌ స్ట్రాలపై నిషేధాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయాలని కోరుతూ అమూల్‌ సంస్థ ప్రధాని మోదీని కోరుతూ లేఖ రాసింది. ఈ మేరకు అమూల్‌ సంస్థ ఎండీ ఆర్‌ఎస్‌ సోధీ తన లేఖలో ప్రధాని మోదీని కోరారు. ఈ లేఖలో త‌క్ష‌ణ‌మే స్ట్రాల‌ను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల రైతులు, పాల వాడ‌కంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయన స్పష్టం చేశారు. ఈ స్ట్రాలపై నిషేధం విధిస్తే చిన్న జ్యూస్ ప్యాకులు, డెయిరీ ఉత్పత్తుల ప్యాక్‌లపై ప్రభావం పడుతుందని తెలిపారు. 

ఇదే క్రమంలో కూల్‌ డ్రింక్‌ సంస్థలైన పెప్సీ, కోకాకోలా కంపెనీలు కూడా కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశాయి. వెంటనే ప్లాస్టిక్‌ స్ట్రాలను బ్యాన్‌ చేస్తే తీవ్రంగా నష్టపోనున్నట్టు తెలిపాయి. ఇక, అమూల్‌ సంస్థ త‌న ప్రొడ‌క్ట్స్ అన్నింటికీ ప్లాస్టిక్ స్ట్రాల‌ను వాడుతుంటుడం గమనార్హం. కాగా, ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్ స్ట్రాలను వినియోగించాలని కేంద్రం ఇది వరకే సూచించింది.

ఇది కూడా చదవండి: ఇకపై రేషన్‌ షాపుల్లో పండ్లు, కూరగాయలు

మరిన్ని వార్తలు