ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణాలు అవేనా..!

3 Dec, 2023 18:06 IST|Sakshi

హిందీ మాతృభాష గల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీశ్‌గఢ్‌ రాష్ట్రాలో కాంగ్రెస్‌ ఘెర పరాజయాన్ని చవిచూసింది. బీజేపికి గట్టి పోటీ ఇచ్చేలా ధీటుగా ప్రచారాలు చేసింది. పలు గ్యారంటీ హామీలతో ముందుకొచ్చింది. కానీ ఓటర్లు అత్యంత విభిన్నంగా తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షడు మల్లికార్జున్‌ ఖర్గే వంటి వ్యూహ చతురతలతో ప్రచారం చేసినా.. ఓటర్ల మనసును గెలుచుకోలాదా? బీజేపీ స్ట్రాటజీ ముందు కాంగ్రెస్‌ గ్యారంటీల గేమ్‌ వర్క్‌ ఔవుట్‌ అవ్వలేదా? అంటే..ఔననే చెప్పాలి. రాష్ట్రాల వారిగా కాంగ్రెస్‌ వైఫల్యానికి దారితీసిన కారణాలు? ప్రముఖులు ఏమంటున్నారు?

రాజస్థాన్‌...
రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల సాంప్రదాయాన్ని తిరగరాయాలని ఎంతో వ్యూహాంతో ముందుకొచ్చింది. ఆఖరికి రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గ విభేధాలను పక్కన పెట్టి ఐక్యతను చాటుకుంది. తాము ఒక్కటేనని చెప్పింది. ఏడు గ్యారంటీ హామీలతో ముందుకొచ్చింది. ఇవేమి రాజస్థాన్‌ ప్రజల మనసును గెలుచుకోలేకపోయాయి. గత కొన్నేళ్లుగా పాలనలో చూసిని అవినితీ, అల్లర్లు, పేపర్‌ లీకేజ్‌లు కాంగ్రెస్‌ పార్టీకి పాలన పరంగా మాయని మచ్చలుగా ఉన్నాయి.

ఇవే కాంగ్రెస్‌కి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోకపోవడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అదీగాక బీజేపీ ప్రచార వ్యూహంలో కాంగ్రెస్‌ మైనస్‌లను హైలెట్‌ చేస్తూ ‍ప్రజల్లో వెళ్లింది. అలాగే రాజస్థాన్‌లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్‌ను బీజేపీ నమ్ముతూ.. విజయావకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు.. తాము అధికారంలో ఉండగా రాజస్థాన్‌కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తుచేస్తూ.. వాళ్లను ప్రసన్నం చేసుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా.. కాంగ్రెస్‌లోని ఐక్యత లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని సత్తా చాటింది. 

మధ్యప్రదేశ్‌..
మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పకడ్బంధీగా వ్యూహాన్ని రచించింది. కర్ణాటకలో తాము చేసిన హామీలకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో  అదే తరహాలో మధ్య ప్రదేశ్‌లో కూడా కొన్ని ఉచిత పథకాలను ప్రకటించింది. ఉచితాలను ప్రధానాస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వ అవినీతిని కూడా లక్ష్యం చేసుకుని ప్రచారానికీ శ్రీకారం చుట్టింది. గానీ మధ్యప్రదేశ్‌ అధికార పార్టీ బీజేపీ కాంగ్రెస్‌ని ఢీ కొనేలా సరికొత్త హామీలతో ముందుకొచ్చింది.

ముఖ్యంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి  గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి 25-30 గ్రామాలకు ఒక ‘సీఎం రైజ్‌’ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని ఓటర్లను ఆకర్షించారు. అలాగే లాడ్లీ బెహనా యోజన, కేంద్ర ఉజ్వల యోజన వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అదీగాక బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చింది. అలాగా ప్రచార ర్యాలీలో రానున్న కాలంలో మధ్యప్రదేశ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ప్రజల నమ్మకాన్ని పొందింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మధ్యప్రేదేశ్‌లో అత్యధిక ఓట్లతో ప్రభంజనం సృష్టించి విజయం సాధించింది. 

చత్తీస్‌గఢ్‌..
చత్తీస్‌గఢ్‌లో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత తోపాటు ఆ రాష్ట్రా సీఎం భూపేష్ బఘేల్, అతని మంత్రులపై వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్‌ మైనస్‌ అయ్యాయి. అందువల్లే కాంగ్రెస్‌ దారుణ పరాజయాన్ని అందుకుంది. ముఖ్యమంత్రి భూపేష్‌ తన నియోజకవర్గం నుంచి గెలిచినప్పటికీ అతని పార్టీ మ్రాతం ఘోరంగా ఓడిపోయింది. ఇవన్నీ బీజేపీ కలిసోచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీలోని అనేక్యత, పాలనాలోపాలే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యతకు కారణాలని చెప్పాలి. 

ఐదు రాష్ట్రాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అనూహ్యంగా ప్రభంజనం సృష్టించి విజయం సొంతం చేసుకుంది. దశాబ్దంగా పాలిస్తున్న కేసీఆర్‌ పాలననె గద్దె దింపి అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కేవలం ఒక్క రాష్ట్రంలోనే తన హవా చూపించగలిగింది కాంగ్రెస్‌. ఉత్తరాది రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మద్యప్రదేశ్‌లో తన పట్టును పూర్తిగా కోల్పోయింది. బీజేపీ మాత్రం ఈ మూడు రాష్ట్రాల గెలుపుతో అనూహ్యంగా తన ఆధిక్యం బలాన్ని పెంచుకుంది 

పలువురు ఏమన్నారంటే..

►ఇది బీజేపీ విజయం కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్‌ వైఫల్యమే అంటూ పశ్చిమ బెంగాల్‌ తృణమాల్‌ కాంగ్రెస్ ఆరోపించింది. ముందు కాంగ్రెప్‌ తన జమిందారీ మనస్తత్వం నుంచి బయటపడాలని మమతా బెనర్జీ వంటి ప్రముఖు అనుభవాన్ని పంచుకోవాలి అమలు చేయాలని అన్నారు. 

►కాంగ్రెస్‌ సిండ్రోమ్‌ నుంచి బయటపడాలని సీనియర్‌ జనతాదళ్‌ యునైటెడ్‌ నాయకుడు కేసిఆర్‌ త్యాగా అన్నారు. ఇక కాంగ్రెస్‌ ఎప్పటికీ బీజేపీతో పోలీపడలేదని తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటికే అన్ని నియోజక వర్గాలకే కాంగ్రెస్‌ దూరమైంది. పైగా కాంగ్రెస్‌ డిసెంబర్‌ 6న పిలుపునిచ్చిన కూటమిని కూడా అపహాస్యం పాలు చేసిందని విమర్శించారు. 

ఈ వ్యాఖ్యాలపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ సినయర్‌ నేత శరద్‌ పవార్‌ మాత్రం ఈ తీర్పు భారత కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. తాము ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం అవుతాం. ఈ వైఫల్యాలకు గత కారణాలపై తమ నేతలతో విశ్లేషిస్తామని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడానికి రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు చేసిన భారత్‌ జోడో యాత్ర ప్రభావమేనని చెప్పారు. ఇక హిందీ హార్ట్‌ ల్యాండ్‌ అయినా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమికి, కులగణన వ్యూహాం ఫలించకపోవుటానికి కారణం తదితరాలపై తమ నేతలతో చర్చించి విశ్లేషిస్తామని చెప్పుకొచ్చారు. 

(చదవండి: ఆధిక్యంలో ఉన్న వసుంధర రాజే..ముచ్చటగా మూడోసారి సీఎం ఆమెనా..?)


 

మరిన్ని వార్తలు