సామ్రాజ్య భారతి 1888/1947

2 Jul, 2022 12:47 IST|Sakshi

ఘట్టాలు
ఉన్నత విద్య కోసం గాంధీజీ దేశాన్ని విడిచి లండన్‌ బయల్దేరారు.

శ్రీ నారాయణ గురు కేరళలోని అరువిప్పురంలో అంటరానివారి కోసం దేశంలోనే మొదటిదైన ఆలయాన్ని ప్రతిష్ఠించారు. శివరాత్రి రోజు ప్రతిష్ఠించిన శివాలయం అది. 

చట్టాలు
ఇండియన్‌ రిజర్వ్‌ ఫోర్సెస్‌ యాక్ట్‌

జననాలు
బాబూ గులాబ్‌రాయ్‌ : రచయిత, చరిత్రకారుడు (ఉత్తరప్రదేశ్‌); చారుచంద్ర బిస్వాస్‌ : నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రి (కలకత్తా); సర్వేపల్లి రాధాకృష్ణన్‌ : భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి (మద్రాసు); సి.వి.రామన్‌ : భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత (మద్రాసు); జె.పి.కృపలానీ : స్వాతంత్య్ర సమరయోధులు, కాంగ్రెస్‌ అధ్యక్షులు (బాంబే);

అబుల్‌ కలామ్‌ అజాద్‌ : స్వాతంత్య్ర సమరయోధులు, భారత తొలి విద్యాశాఖ మంత్రి (మక్కా); అహ్మద్‌ సయీద్‌ దెహ్లవీ : స్వాతంత్య్ర సమరయోధుడు, జమైత్‌ ఎలామ ఎ హింద్‌ తొలి ప్రధాన కార్యదర్శి (ఢిల్లీ); అల్లమ మష్రికీ : గణిత శాస్త్రవేత్త (అమృత్‌సర్‌); సయీఫుద్దీన్‌ కిచ్లూ : స్వాతంత్య్రోద్యమ కార్యకర్త, పీస్‌ మూవ్‌మెంట్‌ లీడర్‌ (అమృత్‌సర్‌); గణేశ్‌ వాసుదేవ్‌ మావ్‌లంకర్‌ : లోక్‌సభ స్పీకర్‌ (గుజరాత్‌); అసఫ్‌ అలీ : భారతదేశానికి అమెరికా రాయబారి (ఉత్తరప్రదేశ్‌); వెంకట్రామ రామలింగం పిళ్లై : స్వాతంత్య్రోద్యమ కవి యోధులు (మద్రాసు); ఆర్‌.సి.మజుందార్‌ : భారతదేశ చరిత్ర కారులు (గోపాల్‌గంజ్, నేటి బంగ్లాదేశ్‌); బిష్ణురామ్‌ మేథీ : అస్సాం ముఖ్యమంత్రి (అస్సాం); నవాబ్‌ ఆలమ్‌ యార్‌ జంగ్‌ బహదూర్‌ : న్యాయమూర్తి, రాజకీయవేత్త (హైదరాబాద్‌); వేటూరి ప్రభాకర శాస్త్రి : తెలుగు కవి, భాషా పరిశోధకులు, చరిత్రకారులు, రేడియో నాటక రచయిత (ఆం.ప్ర).

>
మరిన్ని వార్తలు