బీజేపీ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి లాక్కెళ్తున్న దృశ్యాలు వైరల్‌

5 Apr, 2023 13:20 IST|Sakshi

అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేని బయటకు లాక్కెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు ప్రతిపక్ష నేతతో ఇలానేనా వ్యహిరించేది అంటూ అరవడం కూడా వీడియోలో వినవచ్చు. వివరాల్లోకెళ్తే.. బిహార్‌లోని బీజేపీ ఎమ్మెల్యే జిబేష్‌ కుమార్‌ను అసెంబ్లీ నుంచి కొందరూ మార్షల్స్‌ బయటకు లాక్కెళ్తున్నారు. బిహార్‌ షరీఫ్‌ పట్టణంలో శ్రీరామ నవమి వేడుకల్లో చెలరేగిన అల్లర్లను అరికట్టడంలో మహాఘట్‌ బంధన్‌ సర్కార్‌ అడ్డుకట్టవేయడంలో విఫలమైందని బీజేపీ తీవ్రంగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

అయితే బీజీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం వల్ల ఈ ఘర్షణలు తలెత్తాయని బిహార్‌ ప్రభుత్వం ఆరోపించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఆదివారం నవాడా జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అక్కడ బీజీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి అల్లర్లను తలకిందులుగా ఉరితీస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బిహార్‌ అధికార యంత్రాంగం ఖండించింది. బిహార్‌ షరీఫ్‌ పట్టణంలో జరిగిన అల్లర్లులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దర్యాప్తు సాగుతోందని వెల్లడించింది ప్రభుత్వం. అందుకోసం అదనపు పారామిలటరీ బలగాలను కూడా పంపాలని హోం శాఖ నిర్ణయించినట్లు కూడా బిహార్‌ ప్రభుత్వ పేర్కొంది

ఐతే బిజేపీ నేత జిబేష్‌ కుమార్‌ స్పీకర్‌ని అవమానించడంతో ఆయనపై ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కుమార్‌ సర్వజీత్‌ పేర్కొన్నారు. ఈ రోజు ప్రతిపక్షాలకు చెందిన కొందరూ వ్యక్తులు స్పీకర్‌ని దారుణంగా అవమానించారని అన్నారు. ఇది అసెంబ్లీలో స్పీకర్‌కు జరిగిన అతిపెద్ద అవమానమని మీడియాతో సర్వజీత్‌​ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉందని తెలిపారు. కాగా, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ బిహార్‌లోని ససారం, షరీఫ్‌లలో శ్రీ రామనవమి ఉత్సావాల్లో తొలిసారిగా మతపరమైన ఉద్రిక్తతలు చొటు చేసుకున్నాయని, అది అనుకోకుండా జరిగింది కాదని అనుమానం వ్యక్తం చేశారు. 

(చదవండి: మరోసారి భారీగా కేసులు.. నాలుగువేలకుపైనే! గడిచిన 5 నెలల్లో ఇదే తొలిసారి)
 

మరిన్ని వార్తలు