రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి

17 Dec, 2023 07:34 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో బీజేపీ కొత్త చీఫ్‌ను నియమించనుంది. కేంద్ర మంత్రి, బార్మర్ ఎంపీ కైలాష్ చౌదరిని రాజస్థాన్‌ బీజేపీ కొత్త చీఫ్‌గా నియమించే అవకాశం ఉంది. జాట్ సామాజిక వర్గమే లక్ష్యంగా అధిష్ఠానం పావులు కదుపుతున్నట్లు సమాచారం. కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లో జాట్‌లకు రిజర్వేషన్ కల్పిచింది బీజేపీయే. కానీ ఇటీవల కాలంలో జాట్ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. రాజస్థాన్‌లో దాదాపు 60 స్థానాల్లో జాట్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయా స్థానాల్లో వీరి మద్దతు ఫలితాలను తారుమారు చేస‍్తుంది. ఈ నేపథ్యంలోనే కైలాష్ చౌదరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ నియామకం అయిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా ప్రమాణం చేశారు. రాజపుత్, దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. అటు.. ముఖ్యమంత్రిగా బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను నియమించారు. 

ఇదీ చదవండి: Varanasi: నేడు ప్రధాని మోదీ వారణాసి రాక..

>
మరిన్ని వార్తలు