మితిమీరిన వేగం, ఎగిసిపడిన మంటలు: తృటిలో తప్పిన ఘోరం

4 Dec, 2023 14:04 IST|Sakshi

బెంగుళూరులో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.నాగరభావి-నాయండహళ్లి మధ్య రింగ్‌రోడ్డుపై కారు వెనుక నుంచి బీఎంటీసీ(బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) బస్సును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు లోనయ్యారు. అయితే అదృష్టవశాత్తూ వారంతా  సురక్షితంగా బయట పడ్డారు.  దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బైత్రయాణపుర ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నాగరభావి ప్రధాన రహదారిలోని చంద్రా లేఅవుట్ బస్టాండ్ వద్ద బస్‌స్టాప్‌లో ప్రయాణికులు  వేచి ఉండగా, వేగంగా వచ్చిన కారు బస్సు వెనుక వైపు ఢీకొట్టింది. దీంతో  ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బస్సు పాక్షికంగా దగ్ధమైంది. అయితే ప్రయాణికులందరూ వెంటనే బస్సు నుండి క్రిందికి దిగి పోయారు.  ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న  చిన్నారి స్వల్ప గాయం కాగా, మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు