వేగానికి చెక్ పెట్టే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ - ఎలా పనిచేస్తుందంటే?

2 Dec, 2023 14:57 IST|Sakshi

రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. మితిమీరిన వేగం. ఈ వేగాన్ని నియంత్రిస్తే సగం ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో గూగుల్ తన మ్యాప్స్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్
రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహన వినియోగదారుడు తన మొబైల్‌లోని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, దానికి కుడివైపున ఉన్న ప్రొఫైల్‌ ఐకాన్‌ని ట్యాప్‌ చేసి సెట్టింగ్స్ ఎంచుకోవాలి, ఆ తరువాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేస్తే.. అక్కడ న్యావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డ్రైవింగ్ సెక్షన్ ఆప్షన్‌లో స్పీడోమీటర్ ఆప్షన్‌ సెలక్ట్ చేసుకోవాలి. 

ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు పొందవచ్చు. వేగం పెరిగినటప్పుడు ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తుంది కూడా. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

మితిమీరిన వేగం వల్ల కలిగే అనర్థాలు
పరిమితిని మించిన వేగంతో వాహనదారుడు ప్రయాణించినట్లైతే.. అత్యవసర సమయంలో వాహనాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం, అలాంటి సమయంలో అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టాయి.

ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో వాటర్ లీక్ - వీడియో వైరల్

పరిమిత వేగాన్ని మించి వాహనాన్ని డ్రైవ్ చేస్తే.. వారికి భారీ జరిమానాలు విధించడం లేదా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత వేగంలో వెళ్తున్నామని విషయాన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉంది, అలంటి వారికి గూగుల్ మ్యాప్స్‌లోని కొత్త ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు