హృతిక్‌ మంచి హాస్యగాడు

17 Oct, 2021 11:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ సెట్‌ లేదా జిమ్‌లోనూ ఎక్కువ సేపు సరద సరదాగా గడపడానికే ఇష్టపడతాడు. ఎప్పుడు సోషల్‌ మాధ్యమాల్లో తన ఆనంద క్షణాలని షేర్‌ చేస్తుండే హృతిక్‌ ఈసారి జిమ్‌లో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి షేర్‌ చేశాడు. అందులో హృతిక్‌ 1979లో మిస్టర్‌ నట్వర్‌లాల్‌ సినిమాలోని 'పరదేశీయా' అనే పాటకు గుజరాతీ గర్బా డ్యాన్స్‌తో (దాండియా నేపథ్యం) అలరించాడు.

(చదవండి: నేను మా ఆంటీకి గుడ్‌ బై చెప్పొచ్చా!)

ఆ తర్వాత నవరాత్రి కదా అందుకే ఈ డ్యాన్స్‌ అంటూ చెబుతాడు. అయితే  80 నిమిషాల నిడివిగల ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. పైగా ఈ వీడియోలో ఆధ్యంతం హృతిక్‌ డ్యాన్స్‌తో చక్కగా అలరించాడు. ఈ క్రమంలో హృతిక్‌ సహ నటి దీపికా పదుకొనే హృతిక మంచి హస్యగాడు అంటూ ట్వీట్‌ చేసింది. అంతేకాదు ఇతర నటులు రణవీర్ సింగ్, ప్రీతి జింటా, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్ మరియు వరుణ్ ధావన్ ప్రశంసిస్తూ ట్వీట్‌లు చేశారు. ప్రస్తుతం హృతిక్‌, దీపికా పదుకునే జంటగా 'ఫైటర్‌' అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.

(చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు)

మరిన్ని వార్తలు