మాస్కో- గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

10 Jan, 2023 09:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌: మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. విమానంలో మొత్తం 244 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని, బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. జామ్‌నగర్‌ నుంచి గోవాకి 11 గంటలకు విమానం బయలుదేరి వెళ్లనుంది ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. 

బాంబు బెదిరింపులతో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ) సిబ్బంది విమానం, లగేజ్‌ని తనిఖీలు చేశారు.‘ ఎన్‌ఎస్‌జీకి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. విమానం చాలా పెద్దతి, తనిఖీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. అన్ని రకాల అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాక ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్యలో జామ్‌నగర్‌ నుంచి గోవాకు విమానం బయలుదేరే అవకాశం ఉంది. క్యాబిన్‌లోని మొత్తం లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.’ అని జామ్‌నగర్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: బ్రెజిల్‌ అల్లర్లు: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

మరిన్ని వార్తలు