Dancing at Wedding: ‘ఇదేందిది... హల్దీ ఫంక్షన్‌లో ఇంత అవసరమా?’

10 Dec, 2023 09:03 IST|Sakshi

దేశంలోని చాలా ప్రాంతాల్లో హోరెత్తించే పాటలకు నృత్యాలు లేకుండా వివాహాలు పూర్తికావు. పెళ్లిలో వధువు సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక పెళ్లి కూతురే స్వయంగా నృత్యం చేస్తే, అతిథుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇటువంటి సమయంలో తమ ఇంటి అమ్మాయి వేరొకరి ఇంటికి వెళ్లిపోతున్నదనే బాధ ఆడపిల్ల తరపువారి ముఖాల్లో కనిపిస్తుంది. 

పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వధువు తన హల్దీ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో ఆమె, ఆమె తల్లి కూడా రోదిస్తుంటారు. అలా ఏడుస్తూనే పెళ్లికుమార్తె డాన్స్‌ చేస్తూ ఉంటుంది. దేశిమోజిటో అనే పేరుతో సోషల్‌మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఈ వీడియోను షేర్‌ చేశారు.  ఈ వీడియోలో వధువు డాన్స్‌  చేస్తూవుంటుంది. అక్కడే ఉన్న ఆమె బంధువులు ఆమె నృత్యాన్ని చూస్తుంటారు. 

ఇంతలో పెళ్లి కుమార్తె భావోద్వేగానికి లోనవుతోంది. కన్నీళ్లను నియంత్రించుకోలేకపోతుంది. పక్కనేవున్న తల్లి కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతటి భావోద్వేగాల మధ్య కూడా వధువు ఆపకుండా తన నృత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ వీడియోకు 3.5 లక్షలకుపైగా వ్యూస్‌ దక్కాయి. యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి డ్రామాలు పెరిగిపోయాయని, అందుకే ఈ రోజుల్లో సినిమాలు ఆడడం లేదని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. ఇది బాలీవుడ్ అందించిన బహుమతి అని మరొక యూజర్‌ రాశారు. 
ఇది కూడా చదవండి: నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు..
 

>
మరిన్ని వార్తలు