‘ఈ వీడియో చూపిస్తే కేసు క్లోజ్‌ అవుతుంది’

1 Oct, 2020 19:41 IST|Sakshi

లక్నో: హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దారుణం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది అంటూ యూపీ పోలీసు ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాధితురాలి కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తోన్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో డిస్ట్రిక్‌ మేజిస్ట్రేట్‌ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం చూడవచ్చు. 

జిల్లా మేజిస్ట్రేట్‌ ఒకరు ‘మీ విశ్వసనీయతను పూర్తి చేయవద్దు. ఈ మీడియా వాళ్లు ఈ రోజు ఉంటారు.. రేపు వెళ్తారు. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. స్టేట్‌మెంట్‌ను మార్చడం.. మార్చకపోవడం మీ ఇష్టం. కానీ మేం మార్చగలం’ అన్నారు. ఇంతలో బాధితురాలి బంధువు ఒకరు కెమరా వైపు చూసి ఏడుస్తూ.. ‘వారు మాపై ఒత్తిడి తెస్తున్నారు. మీ కుమార్తె కరోనాతో చనిపోయి ఉంటే కనీసం పరిహారం అయినా దక్కేది అంటున్నారు. మా తండ్రిని, మమ్మల్ని బెదిరిస్తున్నారు’ అంటూ వాపోయింది. (చదవండి: అమ్మను బాధపడవద్దని చెప్పండి..)

అంతేకాక వారు ‘మా తల్లి వీడియోలు తయారు చేశారు. వీటిని చూపిస్తే.. కేసు క్లోజ్‌ అవుతుంది అంటున్నారు. వారు మమ్మల్ని ఇక్కడ బతకనివ్వరు. డీఎం మమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. మాపై ఒత్తిడి తెస్తున్నారు.. బలవంతం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్‌డీ టీవీలో ప్రసారం చేశారు. ఇక హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల దళిత యువతి పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. నలుగురు వ్యక్తులు ఆమెను లాక్కెళ్లి దారుణంగా హింసించారు. బాధితురాలు రెండు వారాల పాటు ఆ‍స్పత్రిలో ప్రాణాలతో పోరాడి మంగళవారం కన్ను మూసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా