సీఎం జగన్‌ను కలిసిన స్వాతిక్‌ సాయిరాజ్‌

1 Oct, 2020 19:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, 2020 అర్జున అవార్డు విజేత తూర్పుగోదావరి జిల్లా వాసి సాత్విక్‌ సాయిరాజ్‌ గురువారం తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వాతిక్‌ సాయిరాజ్‌ను ముఖ్యమంత్రి‌ అభినందించి, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పినిపె విశ్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు. స్వాతిక్‌ సాయిరాజ్‌ది తూర్పుగోదావరి జిల్లా.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా