కోవిడ్‌ వినాశనానికి ప్రభుత్వ వైఖరే కారణం

6 Jun, 2021 04:28 IST|Sakshi

ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌

ముంబై: భారత ప్రభుత్వ అయోమయ ధోరణి దేశంలో కోవిడ్‌ వినాశనం సృష్టించడానికి కారణమని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ పేర్కొన్నారు. దేశంలో కోవిడ్‌–19 వ్యాప్తిని కట్టడి చేయడం మాని, భారత ప్రభుత్వం పేరు సంపాదించడంపై దృష్టి పెట్టడం వల్లే ఈ దారుణ పరిస్థితులు దాపురించాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘అయోమయ వైఖరితో ప్రభుత్వం సరిగా స్పందించలేకపోయింది ఫలితంగా ఈ మహమ్మారిని దేశం ఎదుర్కోలేకపోయింది’ అని చెప్పారు.

మంచి పనుల ద్వారా ఖ్యాతిని ఆర్జించడం మాని, కేవలం పేరును మాత్రమే ఆశించడం అనే మేథో అమాయకత్వం తగదు. కానీ, భారత్‌లో జరుగుతోందిదే’ అని ఆయన పేర్కొన్నారు. సామాజిక అసమానతలు, ఆర్థిక వృద్ధి మందగమనం, పెచ్చుమీరిన నిరుద్యోగం వంటి వాటికి ఈ మహమ్మారి తోడైందని పేర్కొన్నారు. విద్యపై ఉన్న పరిమితుల కారణంగానే మహమ్మారిని పసిగట్టటంలోనూ, సరైన చికిత్సా విధానా లను అంచనా వేయడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు