హిడ్మా ఆట కట్టించేందుకు 'ఆపరేషన్‌ ప్రహార్‌-3'

6 Apr, 2021 13:18 IST|Sakshi

న్యూఢిల్లీ/ రాయ్‌పూర్‌: మావోయిస్టుల దాడిలో 24 మంది జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్ల పట్ల మావోయిస్టుల ఘాతుకానికి దీటుగా బదులిచ్చేందుకు, వారిపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా, భద్రతా బలగాలను ట్రాప్‌ చేసిన మావోయిస్టు బెటాలియన్‌ కమాండర్‌ హిడ్మా లక్ష్యంగా 'ఆపరేషన్‌ ప్రహార్‌-3' చేపట్టనుంది. హిడ్మాతో పాటు 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా.. భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. 

కాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని తెర్రాం వద్ద మావోయిస్టులు జవాన్లపై దాడి చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో, మావోయిస్టులతో చేతులు కలిపి, వారితో భాగస్వామ్యమయ్యే వ్యక్తులను గుర్తించాలని కేంద్ర హోం శాఖ జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా హిడ్మా వంటి కీలక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొత్త ఆపరేషన్‌కు ఉపక్రమించింది.

చదవండి: పెళ్లింట చావు డప్పులు
నెత్తురోడిన బస్తర్‌
 

>
మరిన్ని వార్తలు