భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా కీలక వ్యాఖ్యలు..

25 Dec, 2022 14:23 IST|Sakshi

అరుణాచల్ ప్రదేశ్‌ తవాంగ్ సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చైనా తొలిసారి స్పందించింది. సరిహద్దులో స్థిరత్వం నెలకొల్పి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము సిద్ధమని చెప్పింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని ఆకాక్షించింది.

ఈమేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వాస్ అధికారిక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, దౌత్యపరంగా, సైనిక పరంగా రెండు దేశాలు టచ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సరిహద్దులో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు.

సరిహద్దులో శాంతి స్థాపనకు డిసెంబర్ 20న చైనాతో 17వసారి కమాండర్ స్థాయి చర్చలు జరిపింది భారత్. పశ్ఛిమ సెక్టార్‌లో శాంతియుత వాతావరణానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రకటన విడుదల చేసింది.
చదవండి: Covid-19: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య..

మరిన్ని వార్తలు