ఉత్తరఖండ్‌లో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌.. తప్పిన ఘోర ప్రమాదం

9 Jan, 2024 11:10 IST|Sakshi

డెహ్రాడూన్‌: క్లోరిన్‌ గ్యాస్‌ లీకైన ఘటన ఉత్తరఖండ్‌లో చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌కు సమీపంలోని ప్రేమ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఝంజ్రా ప్రాంతంలో ఓ ఖాళీ ఇంట్లో క్లోరిన్‌ సిలిండర్ల నుంచి గ్యాస్‌ లీకైంది.

మంగళవారం ఉదయం చోటుకున్న ఈ ఘటనతో  సమీపంలో ఉన్న పలు నివాసాల్లోని ప్రజలు తీవ్రమైన శ్వాస ఇబ్బందలను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా  ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. అక్కడ నివసించే పలు కుంటుంబాలను పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. 

ఈ ఘటనపై  సాహస్‌పూర్‌ ఎమ్మెల్యే  సహదేవ్‌ సింగ్‌ స్పదిస్తూ... 7 క్లోరిన్‌ సిలిండర్లు ఖాళీగా ఉ‍న్న ఇంట్లో నిల్వ ఉన్నాయని తెలిపారు. సిలిండర్ల నుంచి క్లోరిన్ లీకేజీ వల్ల ప్రమాదాకర పరిస్థితులు చోటు చేసుకున్నాయని అన్నారు. అయితే సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎస్‌ బృందాలు తీసుకున్న చర్యలు వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు.

చదవండి: Ayodhya: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు?

>
మరిన్ని వార్తలు