కూరగాయల వ్యాపారి రూ.21 కోట్ల స్కాం: మాస్టర్‌  మైండ్‌ కోసం వేట

4 Nov, 2023 18:54 IST|Sakshi

 27 ఏళ్లకే  కూరగాయల వ్యాపారం నుంచి  కోట్ల స్కాం దాకా

ఆరు నెలల్లోనే రూ. 21  కోట్లు

ఇంట్లో నుంచే పని, రివ్యూలు రాసే పార్ట్‌టైమ్ ఉద్యోగంతో భారీ ఆదాయం అంటూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఉద్యోగాలి ప్పిస్తానని  మభ్య పెట్టి ఆరు నెలల్లో  21  కోట్లు ఆర్జించాడు. చివరికి డెహ్రాడూన్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదుతో  అడ్డంగా  బుక్కయ్యాడు. 10 రాష్ట్రాల్లో,  37 ఫ్రాడ్‌ కేసులు సహా,  855 ఇతర కేసులలో ఇతడిదే కీలక పాత్ర అని తేలింది. దీంతో అతనిపై పలు కేసులు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన విషయాలతో  పోలీసులే నివ్వెరపోయారు.

ఉత్తరాఖండ్‌ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం రిషబ్‌ శర్మ ఫరీదాబాద్‌లో కొన్నేళ్లుగా కూరగాయల వ్యాపారం చేసుకునే వాడు.  కానీ  ఆ తరువాత  వర్క్‌  ఫ్రమ్ హోమ్ జాబ్స్‌ పేరుతో  రూ. 21 కోట్ల మోసానికి తెగబడ్డాడు. అయితే  తాజా బాధితుడు, డెహ్రాడూన్‌కు చెందిన వ్యాపారవేత్త రూ. 20 లక్షల మోసపోయాడు. దీంతో అతను ఉత్తరాఖండ్‌లోని పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు అక్టోబర్ 28న  రిషబ్‌  శర్మను  అరెస్ట్‌ చేశారు. 

సైబర్ స్కామర్‌గా ఏలా మారాడంటే...!
కరోనా ఆంక్షల కారణంగా కూరగాయల వ్యాపారి గుర్గావ్‌కు రిషబ్‌ శర్మ కూడా  భారీగా నష్టపోయాడు. దుకాణాన్ని  మూసివేశాడు. ఈ సమయంలోనే కుటుంబ పోషణ నిమిత్తం వర్క్‌  ఫ్రం హోం ఆఫర్లపై దృష్టి పెట్టాడు. అలా అప్పటికే ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న పాత స్నేహితుడిని కలిశాడు. తాను కూడా రంగంలోకి దిగి పోయాడు. పలువుర్ని మోస పుచ్చటం మొదలు పెట్టాడు. దీని ద్వారా  ఊహించని ఆదాయం లభించడంతో మరింత రెచ్చి పోయాడు. అలా  కూరగాయల వ్యాపారి కాస్తా సైబర్ స్కామర్‌గా మారాడు. లక్షల మందిని మోసం చేశాడు. కేవలం ఆరు నెలల్లోనే అతను రూ. 21 కోట్లు సంపాదించాడని ఉత్తరాఖండ్ సీనియర్ పోలీసు అధికారి అంకుష్ మిశ్రా తెలిపారు.

హోటల్ చైన్  అసలు వెబ్‌సైట్  మారియట్‌ డాట్‌ కామ్‌ పోలిన "మారియట్ బోన్‌వాయ్" పేరుతో నకిలీ వెబ్‌ సైట్‌  సృష్టించడమే అతని పని. తన ఉచ్చులో పడిన బాధితులకు హోటల్ యజమానిని అని,  తన ఒక హోటల్‌లో పని చేస్తున్న సహోద్యోగి సోనియాను కూడా పరిచయం చేస్తాడు.  ఆ హోటల్‌కు నకిలీ రివ్యూ రైటర్లకు తొలుత రూ.10 వేలు చెల్లించే వారిని ఆకర్షిస్తాడు. ఇందుకోసం టెలిగ్రామ్ గ్రూపును కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డెహ్రాడూన్‌కు చెందిన బడా వ్యాపారికి ఈ ఏడాది ఆగస్టు 4న వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది.

అందులోని నంబరుకు కాల్‌ చేయడం ఆలస్యం రిషబ్‌ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఇందులో భాగంగానే ఒక్కో రివ్యూకు రూ.10 వేలు  చొప్పున రెండుసార్లు చెల్లించడంతో రిషబ్‌పై పూర్తి నమ్మకం ఏర్పడింది. దీంతో ఏకంగా రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు సదరు వ్యాపారి. తరువాత రిటర్న్స్‌ గురించి అడిగితే మరింత పెట్టుబడి పెట్టాలని డిమాండ్‌  చేశాడు. ఇక  ఆ తరువాతనుంచి ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

రిషబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలను రాబట్టారు.  ఇతర దేశాలకు రహస్యంగా పంపే ముందు దొంగిలించిన డబ్బు కోసం బ్యాంకు ఖాతాలను తెరవడానికి భారతదేశంలోని వ్యక్తులను నియమించు కునే అంతర్జాతీయ క్రిమినల్ గ్రూపులతో సంప్రదింపులు జరుపుతున్నాడని గుర్తించారు క్రిప్టో రూపంలో చైనా, సింగపూర్ వంటి దేశాల నిర్వాహకులకు కోట్లాది రూపాయలు చేరివేసినట్టు అంచనా వేశారు. అంతర్జాతీయ ముఠాలలో ఒకదానికి ఏజెంట్ అని, సాధారణంగా, ఈ ఏజెంట్లకు అసలు సూత్రధారి గురించి ఎటువంటి సమాచారం ఉండదని, మాస్టర్‌ మైండ్‌ని పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని  మిశ్రా  తెలిపారు.. 

మరిన్ని వార్తలు