CJI NV Ramana: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆగ్రహం

30 Apr, 2022 15:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు సందర్భంగా తెలంగాణ చీఫ్‌ సెక్రటరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడంపై సీరియస్‌ అయ్యారు.

తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని.. న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలకు వెళ్లి వెనక్కు వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన తెలంగాణ న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఈ అంశాలను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. 

చదవండి👉 (పంజాబ్‌లో టెన్షన్‌.. టెన‍్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌)

మరిన్ని వార్తలు