ధిక్కారణాధికారాన్ని తొలగించలేరు!

30 Sep, 2021 06:17 IST|Sakshi
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కోర్టులకు ఉండే ధిక్కార శిక్షాధికారాన్ని ఎలాంటి చట్టంతో తొలగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఎన్‌జీఓ చైర్‌పర్సన్‌ను కోర్టు ధిక్కారం కింద విచారిస్తూ గతంలో విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించకపోవడం ధిక్కరణేనని స్పష్టం చేసింది. ముద్దాయివి ధిక్కరణ చర్యలేనని, అలాంటి వాటిని శిక్షించకుండా కోర్టు వదిలేయదని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌తో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది.

సూరజ్‌ ట్రస్ట్‌ ఇండియా అనే సంస్థ అధిపతి రాజీవ్‌ దైయాపై కోర్టు ధిక్కార ఆరోపణలను సుప్రీం విచారించింది. గతంలో రాజీవ్‌ 64 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. దీంతో రాజీవ్‌కు సుప్రీంకోర్టు రూ.25 లక్షల జరిమానాను 2017లో విధించింది. దీనిపై పునఃపరిశీలన జరపాలని రాజీవ్‌ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు రాజీవ్‌ది ధిక్కారమేనని తేలి్చచెప్పింది. రాజీవ్‌ కోర్టులపై బురద జల్లుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధిక్కారణాధికారం తమకు రాజ్యాంగం ఇచి్చందని తెలిపింది.

రాష్ట్రపతితో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నా«థ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. శనివారం విజ్ఞాన్‌ భవన్‌లో న్యాయ సేవలపై అవగా హనా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సదస్సు వివరాలను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రాష్ట్రపతికి వివరించారు.
 

మరిన్ని వార్తలు