బీపీఎల్‌ కుటుంబాలకు సాయం: సీఎం

15 Jun, 2021 13:05 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ సోకి మృతి చెందిన బీపీఎల్‌ కుటుంబాలకు రూ. లక్ష పరిహారం అందిస్తామని సీఎ యడియూరప్ప తెలిపార. సోమవారం కృష్ణాలో ఆయన మీడియాలో మాట్లాడారు. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు వీధిపాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బీపీఎల్‌(పేద) కుంటుంబంలో ఎవరైనా కరోనాతో చనిపోయి ఉంటే ఆ కుటుంబానికి రూ. లక్ష సహాయం చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు మొత్తం రూ. 250 నుంచి 300 కోట్లు వినియోగిస్తామన్నారు. బీపీఎల్‌ కార్డ్‌ ఉన్న కుటుంబాలకు ఈ పరిహారం వర్తిస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు